ఆర్టికల్ 370ని పునరుద్ధరించేంత వరకు పోరాడుతా

ఆర్టికల్ 370ని పునరుద్ధరించేంత వరకు పోరాడుతా

న్యూఢిల్లీ: పద్నాలుగు నెలలుగా నిర్బంధంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మంగళవారం విడుదలయ్యారు. రిలీజైన తర్వాత మెహబూబా ఓ ఆడియో మెసేజ్‌‌ను విడుదల చేశారు. ఈ సందేశంలో ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం పోరాడతానని చెప్పారు. ‘దాదాపు ఏడాది కాలం పాటు నిర్బంధంలో ఉన్న తర్వాత నన్ను రిలీజ్ చేశారు. ఆ చీకటి దినం, నిర్ణయం నా మెదడులో తిరుగాడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా నాలాగే ఆలోచిస్తున్నారని భావిస్తున్నా. సర్కార్ అవమానాన్ని ఎవరూ మర్చిపోరు. ఇది చట్ట విరుద్ధమైన నిర్ణయం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు జమ్మూ కాశ్మీర్ ప్రజలు పోరాడుతారు. ఇది అంత సులువు కాబోదు. నాతోపాటు నిర్బంధంలో ఉన్న చాలా మంది నేతలను కూడా విడుదల చేయాలి’ అని ఆడియో రికార్డింగ్‌‌లో ముఫ్తీ పేర్కొన్నారు.