డిఫెన్స్ రంగంలోకి మేఘ ఇంజినీరింగ్

డిఫెన్స్ రంగంలోకి మేఘ ఇంజినీరింగ్
  • రూ. 500 కోట్లతో హైదరాబాద్ లో ఫెసిలిటీ
  • మిసైల్స్ , మెషిన్ గన్స్ , రాకెట్ లాంఛర్స్ తయారీ

ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలోని మేఘ ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్ ) డిఫెన్స్  ఎక్విఫ్ మెంట్ మాన్యుఫాక్చరింగ్ రంగంలోకి అడుగుపెడుతోంది. డిఫెన్స్ ఎక్విఫ్ మెంట్ మాన్యుఫాక్చరింగ్ కోసం హైదరాబాద్ లో రూ. 500 కోట్లతో ఫెసిలిటీ పెట్టనుంది. ఆయుధాలు, వెహికల్స్  , యాన్సిలరీలు, డిఫెన్స్ కు అవసరమైన ఎక్విఫ్ మెంట్  తయారీ కోసం అవసరమైన అనుమతులకు అన్నింటినీ మేఘ ఇంజినీరింగ్ ఇప్పటికే అప్లై చేసుకుంది. మేకిన్ ఇండియా ఇనిషియేటివ్ కింద కింద డిఫెన్స్ ప్రొక్యూర్ మెంట్ పాలసీ 2020 కింద అప్లికేషన్స్  పెట్టుకున్నట్లు మేఘ ఇంజినీరింగ్ ఒక ప్రకటనలో తెలిపింది. అప్లికేషన్ పరిశీలించిన పభుత్వం అవసరమైన అనుమతులు జారీ చేసినట్లు ఎంఈఐఎల్ పేర్కొంది. కన్ స్ట్రక్చన్, ఇన్ఫాస్ట్రక్చన్ తో మొదలు పెట్టి ఆ తర్వాత  ఆ ఆయిల్ అండ గ్యాస్ , పవర్ , సోలార్ పవర్ , ఏవియేషన్ సెక్టార్లకు విస్తరించామని, తాజాగా డిఫెన్స్ ఎక్విప్ మెంట్ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడించింది. గూప్ లోని ఐకామ్ టెలి లిమిటెడ్ ఇప్పటికే డిఫెన్స్ ఇన్ స్టిట్యూషన్స్ కు సైన్స్, టెక్నాలజీ రంగంలలో సేవలు అందిస్తున్నట్లు ఎంఈఐఎల్ పేర్కొంది. పవర్ డిస్ట్రిబ్యూషన్ ,ట్రాన్స్ మిషన్, సోలార్ పవర్  రంగాలలోనూ ఐకామ్ టెలీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వివరించింది. అడ్వాన్స్ డ్ కమ్యినికేషన్ రేడియోస్ , జామర్స్ , ఈడబ్ల్యూ షెల్టర్స్, యాంటెన్నాస్ , ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ కంటెయినర్స్ , విండ్ ప్రొఫైల్, రాడార్స్ ఈ గూప్ కంపెనీ సప్లై చేస్తున్నట్లు తెలిపింది. కరోనా టెస్టుల కోసం మొదటి మొబైల్  వైరాలజీ ల్యాబ్ ను ఏప్రిల్ నెలలో ఐకామ్ అందుబాటులోకి తెచ్చిందని కూడా ఎంఈఐఎల్ పేర్కొంది. మోడరన్ డిఫెన్స్ ఎక్విప్ మెంట్ తయరీ కోసం హైదరాబాద్ వద్ద రూ. 500 కోట్లతో ఈ యూనిట్ ను పెడుతున్నట్లు తెలిపింది. పధాన మంత్రి విజన్ , మేక్ ఇన్ ఇండియా డ్రీమ్ నెరవేర్చే దిశలో ఈ చొరవ తీసుకుంటునట్లు ఎం ఈఐఎల్ ప్రెసిండ్ శీనివాస్ బొమ్మారెడ్డి చెప్పారు. కంబాట్ వెహికిల్స్ కు అవసరమైన యాక్సిలరీలు, లైట్ కంబాట్ వెహికిల్స్, ఆర్మర్డ్ ఇంజినీరింగ్ రికవరీ వెహికిల్స్ ను కొత్త యూనిట్లలో తయారు చేయనున్నారు. వీటితో పాటు మిసైల్స్ ,మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్స్, మెషిన్ గన్స్, రాకెట్స్ ,క్యానన్స్ వంటి ప్రొడక్షన్ ను  చేపట్టనున్నారు.