అమెజాన్ నూతన సీఈఓగా ఆండీ జాస్సీ

అమెజాన్ నూతన సీఈఓగా ఆండీ జాస్సీ

అమెజాన్  కొత్త CEO గా 53 ఏళ్ల ఆండీ జాస్సీ బాధ్యతలు స్వీకరించారు. జెఫ్ బెజోస్ అమెజాన్ ను 1994లో స్థాపించారు. తక్కువ కాలంలోనే తిరుగులేని ఈ-కామర్స్ పోర్టల్ గా అమెజాన్ ఎదగడంలో బెజోస్ కీలక పాత్ర వహించారు. 1.7 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ శక్తిగా అమెజాన్ ను అభివృద్ధి చేసిన.. బెజోస్ తాను CEOగా తప్పుకుంటున్నట్టు ఇటీవలే ప్రకటించారు. తన స్థానంలో ఆండీ జాస్సీ ఇకపై కంపెనీని నడిపించనున్నట్లు తెలిపారు. అమెజాన్ ఇప్పుడు ఈ-మార్కెట్ రంగంలోనే కాదు OTT (అమెజాన్ ప్రైమ్), క్లౌడ్ కంప్యూటింగ్ ( అమెజాన్ వెబ్ సర్వీసెస్) రంగాల్లోనూ సత్తా చాటుతోంది. 

జాస్సీ.. ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి పట్టా అందుకున్నారు. క్రీడల పట్ల మక్కువ చూపించే అమెజాన్ నూతన సీఈఓ తన ఇంటిలోనూ క్రీడా వేదికలను తలపించే నిర్మాణాలతో తన అభిరుచిని చాటుకున్నారు.