సెలూన్ యజమాని వేధింపులతో.. సానిటైజర్ తాగి యువతి ఆత్మహత్య

సెలూన్ యజమాని వేధింపులతో ఓ యువతి సానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మీర్ పేట్  పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.  గత కొంత కాలంగా  ఓ సెలూన్ లో పని చేస్తున్న దివ్యను యజమాని మురళి లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు సమాచారం.

ఈరోజు 2024 జనవరి 30న మరళి సెలూన్ లో ఉన్న ఓ గదిలోకి దివ్య(18)ను తీసుకెళ్లి రేప్ చేయడానికి ప్రయత్నం చేయగా.. దివ్య బయటికి వచ్చి అరవడంతో మురళి అక్కడి నుంచి పరారైయ్యాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దివ్య సెలూన్ లో ఉన్న శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది. గతంలో పలుమార్లు మురళి దివ్యను రేప్ చేశాడని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

విషయం తెలుసుకున్న దివ్య కుటుంబ సభ్యులు సెలూన్ దగ్గర ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లేది లేదని.. పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. వారికి నచ్చజేప్పిన పోలీసులు.. పోస్టుమార్టం నిమత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.