Sankranthiki Vasthunnam: ప్రేమ పేజీలో అందాల మీనా.. సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ సింగిల్ రిలీజ్

విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(SankranthikiVasthunam). మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌‌. జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. .'మీనూ..'(Meenu) అంటూ సాగే మెలొడీ సాంగ్ వినసొంపుగా ఉంది. "నా లైఫ్ లో ఉన్న ఆ ప్రేమ పేజీని తీయన..పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా.. " అంటున్న ఈ పాట అలిగిన మీనాక్షిని నవ్వించే ప్రయత్నంలో భాగంగా లిరికల్ ఆకట్టుకుంటోంది. డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌‌లోని అద్భుతమైన లొకేషన్లలో ఈ సాంగ్ షూట్ చేశారు.

ఈ పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయడంతో పాటు ప్రణవి ఆచార్యతో కలిసి పాడాడు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఇటీవలే ‘గోదారి గట్టుమీద రామ చిలకవే.. ఓ గోరింటాకెట్టుకున్న సందమామవే’ అంటూ సాగిన ఫస్ట్ సింగిల్ మెలోడీ గీతం శ్రోతలను వీపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ క్యూట్ మెలోడీ సాంగ్ ఎలాంటి అనుభూతి ఇవ్వనుందో చూడాలి మరి.

Also Read:-బాలీవుడ్లో పుష్ప 2 Vs బేబీ జాన్‌.. డైరెక్టర్ అట్లీ ఏమన్నాడంటే?

దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్, మురళీధర్ గౌడ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.