హైదరాబాద్, వెలుగు: వైద్య ఆరోగ్యశాఖలో 633 ఫార్మాసిస్ట్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు వచ్చే నెల 5 తేదీ నుంచి అదే నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని ఎడిట్ చేసుకునేందుకు 23వ తేదీ నుంచి 24 తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. నవంబరు 30వ తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో రాత పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం 80 మార్కుల రాత పరీక్ష, మరో 20 మార్కులు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సర్వీస్‌కు వెయిటేజీ కల్పిస్తామన్నారు.
