ముంపు బాధితులు అధైర్యపడొద్దు

  • ప్రభుత్వం అండగా ఉంటుంది
  • పలు కాలనీల్లో పర్యటించిన మంత్రి దామోదర

సంగారెడ్డి టౌన్, వెలుగు: ముంపు బాధితులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రెవెన్యూ కాలనీ, శ్రీ చక్ర కాలనీల్లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి బాధితులను పరామర్శించారు. పట్టణానికి అనుకొని ఉన్న ఎర్రకుంట, చంద్రయ్య కుంటల్లో వరద కాల్వలు పూడుకపోవడం, ఎర్రకుంట తూము చిన్నగా ఉండడం వల్ల వరద నీరు బయటకు వెళ్లలేక, రెవెన్యూ కాలనీ, శ్రీ చక్ర కాలనీల్లోకి వచ్చినట్లు కాలనీ వాసులు మంత్రితో తెలిపారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్​లో ఇండ్లలోకి వరద నీరు రాకుండా వరద కాల్వలు పూడిక తీసి, తూములు వెడల్పు చేయాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్, నీటిపారుదల శాఖ అధికారులు, మున్సిపల్అధికారులు పాల్గొన్నారు.