మేడ్చల్లో మల్లారెడ్డి అక్రమ కట్టడాలు కూల్చివేత

మేడ్చల్ జిల్లా మున్సిపల్ పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు. TPO రాధాకృష్ణ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన రేకుల షెడ్డును శనివారం ఉదయం కూల్చేశారు.జాతీయ రహదారిపై మేడ్చల్ డిపోకు ఎదురుగా ఉన్న రేకుల షెడ్లు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కూల్చివేసినట్లు తెలిపారు మున్సిపల్ అధికారులు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు మేరకే మాజీ మంత్రి  ఎమ్మెల్యే మల్లారెడ్డి కి సంబంధించి అక్రమ నిర్మాణాల కూల్చివేత్తలు జరిగినట్లు సమాచారం.

ఇటీవల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో అక్రమ కట్టడాలను కూడా మున్సిపల్ అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసిందే.  ప్రభుత్వ భూమిని కబ్జా చేసి బిల్డింగ్ కట్టారని..  జేసీబీలతో వెళ్లి కూల్చేశారు అధికారులు.