చంద్రబాబు మ్యానిఫెస్టోకు.. శని చేతిలోని పాచికలకు తేడా లేదన్నారు. చంద్రబాబు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా దాని విలువ సున్నానే అని అన్నారు. చంద్రబాబు తాజా వాగ్ధానాల్లో కిచిడీ మాటలు చెబుతున్నారన్నారు. దత్తపుత్రుడు సిట్ అంటే..సిట్ స్టాండ్ అంటే నిల్చుండాడని అన్నారు. నారా లోకానికి.. నరక లోకానికి తేడా లేదు కాబట్టి... ఎంట్రన్స్ లోనే స్వర్గం చూపిస్తున్నారని జగన్ అన్నారు. 2014లో ఇచ్చిన ప్రత్యేక హామీ ఏమైంది అని ప్రశ్నించారు.
చంద్రబాబు చెబుతున్న సూపర్ 6 హామీలకు ఏడాదికి 87,317 కోట్లు కావాలి.. ఏడో హామీకి 87 వేల కోట్లు కావాలి... ఈ డబ్బు ఎక్కడినుంచి తీసుకొస్తాడో చెప్పడం లేదు. ఇంటింటికి మంచి చేసేందుకు వైసీపీ సిద్ధం గా ఉందని సీఎం జగన్ అన్నారు. 58 నెలల్లో 3.78 లక్షల కోట్లను ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టామన్నారు. డీబీటీ పద్దతిలో ఏడాదికి 75 వేల కోట్లు ఇచ్చామన్నారు. 58 నెలల్లో 138 సార్లు బటన్ నొక్కి పేదల ఖాతాల్లో డబ్బు జమ చేశామన్నారు. 2019 ఎన్నికలకు ముందు మీకు మంచి చేస్తానని చెప్పా... పేదవారి భవిష్యత్ బాగుండాలంటే.. జగనన్న రావాలి అని చెప్పాలని కోరారు. జగన్ మార్కు రాజకీయంలో విశ్వసనీయత, నిబద్దత ఉందన్నారు. నాపై అరడజను పార్టీలు బాణాలు ఎక్కు పెట్టాయన్నారు.
చంద్రబాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలు వస్తాయి... చంద్రబాబు చెప్పే అబద్దాలకు హద్దు లేదు..చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు రద్దు.. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం రద్దు..లంచాలు.. వివక్ష రాజకీయం వస్తుంది. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని నిద్రలేపి ఇంటికి తెచ్చుకున్నట్లే నని జగన్ అన్నారు.చంద్రబాబు రంగు రంగుల మ్యానిపెస్టో చూపించి మోసం చేస్తాడని అన్నారు. 2014 లొ టీడీపీ హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించారు.
2024 ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే ... మళ్లీ వస్తేనే ఈ పథకాలు కొనసాగుతాయి. సైకిల్ బయటే ఉండాలి.. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలన్నారు. 175 కు 175 అసెంబ్లీ సీట్లు .. 25 కు 25 ఎంపీ గెలవడానికి సిద్దమేనా అని ప్రశ్నించారు. పేదవారి భవిష్యత్తు కోసమే వైసీపీకి అధికారంలోకి రావాలన్నారు. మేం చేసేదే చెప్తాం... చెప్పినది ఖచ్చితంగా చేస్తాం అన్నారు. మీ బిడ్డ పేరు ఎప్పుడూ చరిత్రలో ఉండాలన్నారు. కరోనా లాంటి కష్టాన్ని ఎదుర్కున్నామన్నారు. మాట ఇస్తే తగ్గేదేలేదన్నారు. 99 శాతం వాగ్ధానాలను అమలు చేశామన్నారు.
ALSO READ :- Yusuf Pathan: రాజకీయం వంటబట్టింది.. పేదల పెన్నిదిగా యూసుఫ్ పఠాన్ తొలి వాగ్దానం
2024 ఎన్నికల తరువాత కూడా మనం అమలు చేస్తున్న పథకాలు ఉండాలి.. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ పథకాలు అన్నీ రద్దవుతాయన్నారు. అధికారమంటే నాకు వ్యామోహం లేదు. పేదలు అభివృద్ది చెందడానికి ఎక్కడా తగ్గలేదన్నారు. త్వరలోనే మ్యానిఫెస్టో విడుదల చేస్తామంటూ.... చేసేదే చెబుతామన్నారు. 2024 ఎన్నికల యుద్దంలో వెన్నుపోటు దారులను... వంచకులను ఇంటికి పంపించేందుకు సిద్దమేనా అని ప్రశ్నించారు. మరో ఐదేళ్లు ప్రజా పాలన చేసేందుకు జగన్ అనే నేను సిద్దమని మేదరమెట్ల సిద్ధం సభలో సీఎం జగన్ అన్నారు.