ప్రజాపాలన కేంద్రాల తనిఖీ

పెద్దశంకరంపేట, వెలుగు:పెద్దశంకరంపేటలోని ఎంపీడీవో ఆఫీసును మెదక్ జడ్పీ సీఈవో ఎల్లయ్య శుక్రవారం తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన కేంద్రానికి వచ్చే దరఖాస్తులను వెంటనే ఆన్​లైన్​లో నమోదు చేయాలని సూచించారు.

అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలను తప్పనిసరిగా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రఫీక్​ఉన్నిసా, ఎంపీవో విఠల్ రెడ్డి, పర్యవేక్షకుడు షాకీర్, ఆఫీసు సిబ్బంది, జీపీ సెక్రటరీలు పాల్గొన్నారు.