మెదక్ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కాలేజీకి .. న్యాక్ ఏ గ్రేడ్

  • క్వాలిటీ ఎడ్యుకేషన్ తో మెరుగైన ఫలితాలు
  • ప్రతి ఏటా 95 శాతం ఉత్తీర్ణత
  • స్టూడెంట్స్ కు  కాంపిటెటివ్ ఎగ్జామ్ లకు, ఎంప్లాయిమెంట్ చూపే కోర్సుల్లో శిక్షణ  
  •   స్పోర్ట్స్ లో స్టేట్, నేషనల్ లెవెల్ టోర్నీల్లో ప్రతిభ, పతకాల సాధన 
  •  న్యాక్ ఏ గ్రేడ్ హోదా దక్కడంతో యూజీసీ నుంచి పెద్ద మొత్తంలో ఫండ్స్ వచ్చే అవకాశం

మెదక్, వెలుగు: మెదక్ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కాలేజీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కమిటీ (న్యాక్​) ప్రశంసలు అందుకోవడంతో పాటు రాష్ట్రంలో గురుకుల కాలేజీ స్థాయిలో మొదటిసారి న్యాక్​ ఏ గ్రేడ్ సాధించింది. తద్వారా ఈ కాలేజీకి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించడంతోపాటు యూజీసీ నుంచి పెద్ద మొత్తంలో ఫండ్స్​ మంజూరు కానున్నాయి. ​మెదక్​ పట్టణంలో 2017లో గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటైంది. ప్రస్తుతం 4 కోర్సుల్లో మొత్తం 275 మంది స్టూడెంట్స్​ఇక్కడ చదువుకుంటున్నారు. అనుభవజ్ఞులైన లెక్చరర్లు క్వాలిటీ ఎడ్యుకేషన్​అందిస్తుండడంతో పాటు, విద్యేతర అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 

డిగ్రీ అనంతరం ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు, సెల్ప్​ఎంప్లాయిమెంట్​కు బాటలు వేసేలా ఆయా అంశాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. అంతేగాక స్పోర్ట్స్​లో స్టూడెంట్స్​కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ గురుకుల స్టూడెంట్స్​ప్రతి ఏటా 95 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. పలువురు స్టూడెంట్స్​విదేశాల్లో ఉన్నత చదువులకు సెలెక్ట్​అయ్యారు. కొందరు ఉన్నత ఉద్యోగాలు సాధించారు. మరికొందరు స్టేట్, నేషనల్​లెవల్​స్పోర్ట్స్​మీట్లలో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. నేషనల్​సర్వీస్​ స్కీంలో సైతం ఈ కాలేజీ స్టూడెంట్స్​ఉత్సాహంగా పాల్గొని సామాజిక సేవా భావాన్ని పెంపొందించుకుని భవిష్యత్​కు మెరుగైన బాటలు వేసుకున్నారు.   

రాష్ట్రంలో మొత్తం 22 గిరిజన గురుకుల కాలేజీలు ఉండగా న్యాక్​ఇప్పటి వరకు 7 కాలేజీలను సందర్శించింది. ఆయా కాలేజీల్లో విద్యాబోధన, కాలేజ్​నిర్వహణ తీరు, ఇతర అంశాలను పరిశీలించింది. ఈ నెల 5, 6న న్యాక్ బృందం పట్టణంలోని ట్రైబర్​వెల్ఫేర్​యూత్ ట్రైనింగ్ సెంటర్ లో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీని సందర్శించింది. జాతీయ స్థాయి ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో కాలేజీ పనితీరును  పరిశీలించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్​తో పాటు వారి తల్లిదండ్రులతోనూ బృందం సభ్యులు సమావేశమయ్యారు. 

కాలేజీలో గిరిజన బాలిక విద్యాభివృద్ధికి అమలవుతున్న కార్యక్రమాలు, స్టూడెంట్స్​ప్రగతిని చూసి మంత్రముగ్ధులయ్యారు. క్వాలిటీ ఎడ్యుకేషన్​తో పాటు, విద్యేతర అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తుండడాన్ని గుర్తించారు. కాలేజీలో అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రిన్సిపాల్ ఉమాదేవి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా న్యాక్​బృందానికి వివరించారు. నిర్దేశిత అన్ని అంశాలపై న్యాక్​బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు గురుకుల కాలేజీ స్థాయిలో రాష్ట్రంలో మొదటి సారిగా మెదక్​ గిరిజన మహిళా డిగ్రీ కాలేజ్​కు 'ఏ' గ్రేడ్​ కేటాయించింది.  

అందరి సహకారంతోనే సాధించాం

మా కాలేజీకి న్యాక్  'ఏ'  గ్రేడ్ హోదా దక్కడం హర్షణీయం. స్టూడెంట్స్​భవిష్యత్​ను దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ ఎడ్యుకేషన్​ అందించడంతో పాటు, ఉన్నత చదువులు, ఉద్యోగాల కల్పన, స్వయం ఉపాధికి దోహదపడేలా శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. న్యాక్​ ఏ గ్రేడ్​ హోదా దక్కడం వల్ల స్టూడెంట్స్​అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది వారి భవిష్యత్​కు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఉమాదేవి, కాలేజీ ప్రిన్సిపాల్