- చైర్మన్, వైస్ చైర్మన్ల మధ్య గొడవ
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ మున్సిపల్జనరల్బాడీ మీటింగ్రసాభాసగా మారింది. శనివారం చైర్మన్ చంద్రపాల్అధ్యక్షతన సమావేశం నిర్వహించగా సభ్యులు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ వివరాలన్నీ ఎజెండాలో పెట్టాలని వైస్ చైర్మన్మల్లికార్జున్గౌడ్ కమిషనర్జానకీరామ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చైర్మన్ చంద్రపాల్ జోక్యం చేసుకొని ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగేలా ప్రయత్నించారు.
కానీ వైస్ చైర్మన్మల్లికార్జున్గౌడ్ ఆమ్యామ్యాలు ఇస్తేనే పని చేస్తారని చైర్మన్ ను ఉద్ధేశించి అనడంతో ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో వైస్చైర్మన్మల్లికార్జున్ఆగ్రహంతో వేదికపై నుంచి వచ్చి కింద తోటి కౌన్సిలర్లతో కూర్చున్నారు. అనంతరం చైర్మన్ చంద్రపాల్వైస్చైర్మన్ను వేదికపైకి రావాలని పిలవడంతో మల్లికార్జున్గౌడ్తిరిగి వెళ్లి వేదికపై కూర్చున్నారు. అనంతరం కౌన్సిలర్లు కల్యాణి, జయశ్రీ మాట్లాడుతూ.. పట్టణంలోని పోస్టాఫీసు క్వార్టర్స్విషయంలో ఆ డిపార్ట్ మెంట్ వారు ఇబ్బందులు పెడుతూ ప్రజాప్రతినిధులు, నాయకులపై కేసులు పెడుతున్నారని సభ దృష్టికి తీసుకురాగా అందుకు స్పందించిన చైర్మన్ వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, నీటి సరఫరా బంద్ చేయాలని అధికారులను ఆదేశించారు.
రాందాస్ చౌరస్తాలో మెయిన్ రోడ్డుపై మిషన్‌భగీరథ పైప్లైన్లీకేజీ అవుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని కౌన్సిలర్ కృష్ణారెడ్డి సభ దృష్టికి తీసుకురాగా చైర్మన్ స్పందిస్తూ పనులు చేయలేదని కాంట్రాక్టర్‌కు రూ.1.34 కోట్లు ఇవ్వకుండా నిలిపివేశామన్నారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. బీజేపీ కౌన్సిలర్ మేఘమాల మాట్లాడుతూ వార్డులో సమస్యల విషయంలో అధికారులకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడంలేదని మండిపడ్డారు. కౌన్సిలర్ భీమరి కిశోర్ ఔరంగాబాద్‌లో బుష్ కటింగ్ చేయాలని అధికారులు, సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని డీఈకి చెప్పినా వినపడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. పట్టణంలో తైబజార్ వసూళ్లు యాక్షన్పెట్టాలని, రైతులు, చిన్నచిన్న వ్యాపారుల వద్ద నుంచి వసూళ్లు చేయకుండా చూడాలన్నారు. సమావేశంలో డీఈ మహేశ్, ఏఈ బాలసాయాగౌడ్, శానిటరీ ఇన్స్పెక్టర్, మహేశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.