ఇండ్లు కోల్పోయిన వాళ్లకు కోకాపేటలో ఇండ్లు నిర్మించాలి: ఎంపీ రఘునందన్ రావు

చెరువుల్లో ఇండ్లు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చిన వారిపై కేసులు పెట్టాలన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు కేసుల విచారణలో భాగంగా 50 మంది కార్యకర్తలతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. 

హైదరాబాద్ కోకాపేట్ లో సిద్ధిపేట మాజీ కలెక్టర్ ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి 10 ఎకరాలు ఉందని..ఆ భూమి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ కాలేదని ఆరోపించారు. ధనిక వ్యక్తుల దగ్గర ఉన్న అలాంటి భూమిని చెరువులో ఇండ్లు కోల్పోయిన వారికి ఇస్తే బాగుంటుందన్నారు.ఉప్పల్లో ఉప్పల్ బాగాయత్ అనే లేఅవుట్ పెట్టి HMDA ప్లాట్లను అమ్మారని.. కోకాపేటలో అలాంటి లేఅవుట్లు పెట్టి ఇండ్లు కోల్పోయిన పేదవారికి ఇండ్ల స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు.