మెదక్​ మెడికల్ ​కాలేజీకి భూమి, నిధులు కేటాయించాలి : రఘునందన్​రావు

  • సీఎంకు వినతిపత్రం సమర్పించిన మెదక్​ ఎంపీ రఘునందన్​రావు

మెదక్​ టౌన్​, వెలుగు : మెదక్ పట్టణంలో ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్​ కాలేజీకి అవసరమైన భూమితో పాటు నిధులు కేటాయించాలని  ఎంపీ రఘునందన్​రావు సీఎం రేవంత్​రెడ్డికి వినతిపత్రం అంజేశారు. మెదక్​ జిల్లాకు మెడికల్​ కాలేజీ మంజూరు చేసినందుకు సీఎం రేవంత్​రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మెడికల్​ కాలేజీ  సొంత భవనం నిర్మాణానికి 20 ఎకరాల భూమి అవసరం ఉంటుందని వీలైనంత త్వరగా కేటాయించాలన్నారు.  

ప్రజారోగ్యం, విద్యను మెరుగుపరచడంలో ఒక మైలురాయిగా పనిచేస్తుందని ఎంపీ రఘునందన్​రావు అన్నారు. సీఎం రేవంత్​రెడ్డితో పాటు జిల్లా ఇన్ చార్జి  మంత్రి కొండా సురేఖ, మెదక్​ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​ రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్​పర్సన్​ సుహాసినిరెడ్డి, కాంగ్రెస్​ పార్టీ నాయకులు అనిల్​ కుమార్​ తదితరులు ఉన్నారు.