హైడ్రాతో నష్టపోయిన పేదలకు ప్లాట్లు ఇవ్వండి :ఎంపీ రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు: హైడ్రాతో నష్టపోయిన పేదలకు మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి కోకాపేటలో కట్టబెట్టిన భూములను ప్లాట్లుగా మార్చి ఇవ్వాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బుధవారం దుబ్బాక కోర్టుకు బీజేపీ కార్యకర్తలపై నమోదైన కేసు విషయంలో హాజరయ్యారు. హైడ్రాను సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా విస్తరించడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. కానీ హైడ్రాతో నష్టపోయిన పేదలకు ప్లాట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.

చెరువుల్లో ఇండ్లు నిర్మించడానికి పర్మిషన్​ ఇచ్చిన అధికారులు, కరెంట్​ పర్మిషన్​ ఇచ్చిన విద్యుత్​ అధికారులు, హౌజింగ్​ లోన్లు ఇచ్చిన బ్యాంకు అధికారులపై క్రిమినల్​ కేసులు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు.  అధికారులే అనుమతులు ఇవ్వకుంటే పేదలు ఇళ్లను కట్టుకునే వాళ్లు కాదన్నారు.  అకాల వర్షాలతో ఇళ్లు కోల్పోయిన బాధితులకు వెంటనే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో గాని, ప్రధానమంత్రి ఆవాస యోజన పేరుతో గాని ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంబటి బాలేశ్ గౌడ్​, ఎస్​ఎన్​చారీ, మట్ట మల్లారెడ్డి, సుభాశ్ రెడ్డి, విబీషణ్ రెడ్డి, దూలం వెంకట్​ గౌడ్​, అరిగె కృష్ణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.