ఏడుపాయల అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే రోహిత్

  • పూజలు చేసిన ఎమ్మెల్యే  రోహిత్ దంపతులు

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల అభివృద్ధికి కృషి చేస్తానని మెదక్​ ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. పాపన్నపేట మండలం  ఏడుపాయల వన దుర్గ భవాని మాతా సన్నిధిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.  బుధవారం సప్తమి పురస్కరించుకొని అమ్మవారిని తెలుపు రంగు వస్త్రాలతో సరస్వతి దేవిగా అలంకరించారు.  ఆలయ అర్చకులు శంకర శర్మ ఇతర బ్రాహ్మణులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  రాజగోపురం తో పాటు గోకుల్ షెడ్ లోని అమ్మవారిని సైతం సరస్వతీ మాతా రూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు. 

మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు దంపతులు ఏడుపాయలకు చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం రాజగోపురంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహంతో పాటు శరన్నవరాత్రులు నిర్వహిస్తున్న గోకుల్ షెడ్  లో ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు.  అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..  ఏడుపాయల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తామని పేర్కొన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోవింద నాయక్, సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శెట్టి శ్రీకాంత్ తప్ప,మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్​, గౌస్​, నరేందర్​గౌడ్​, చోటు తదితరులు పాల్గొన్నారు.