బలహీన వర్గాలకు ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే రోహిత్ రావు

మెదక్, వెలుగు: బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేయనుందని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. శనివారం పట్టణంలోని ద్వారకా గార్డెన్స్ లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.  ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేతో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు. 

సర్వే విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు మాట్లాడుతూ.. రానున్న  స్థానిక ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పెద్దపీట వేయనుందన్నారు. బీసీలు కులాల వారీగా విడిపోవద్దని, అలా జరిగితే బీసీల ఎదుగుదల కుంటుపడే అవకాశం ఉందన్నారు. బీసీలు ఐక్యతతో ఉంటేనే అన్ని అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నారు.  సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ సెగ్మెంట్ పార్టీ ఇన్ చార్జి ఆవుల రాజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్ర పాల్, కాంగ్రెస్ నాయకులు ఉప్పల రాజేశ్, బొజ్జ పవన్, సుప్రభాత్ రావు, గంగా నరేందర్, రాజిరెడ్డి, శంకర్, శ్రీనివాస్ చౌదరి, ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.