తెలంగాణ ప్రతీక బతుకమ్మ .. మెదక్ కలెక్టరేట్​లో ఉత్సాహంగా సంబరాలు

మెదక్, వెలుగు:  తెలంగాణ  పండుగల్లో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉందని,  మన పండుగ, మన సంస్కృతికి, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక  బతుకమ్మ పండగ అని మెదక్​ కలెక్టర్​ రాహుల్​ రాజ్​ అన్నారు. బుధవారం ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్‌‌లో అధికారికంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలకు హాజరైన కలెక్టర్​రాహుల్​రాజ్ మహిళలతో కలిసిసంబరాల్లో ఆడి పాడారు.  అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు, డీఆర్​డీఓ శ్రీనివాస్​ రావ్, డీఎంహెచ్​ఓ డాక్టర్​ శ్రీరాం, మెదక్​ ఆర్డీఓ రమాదేవి కూడా బతుకమ్మ ఆడారు.

జిల్లాలోని వివిధ మండలాల నుంచి తరలివచ్చిన సెల్ఫ్​ హెల్ప్​ గ్రూప్​ల మహిళలు, అంగన్​ వాడీ టీచర్​లు, కలెక్టరేట్ లోని వివిధ డిపార్ట్​ మెంట్​ లలో పని చేసే మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.  డీఆర్​డీఓ బతుకమ్మకు ఫస్ట్​ ప్రైజ్, మెప్మా బతుకమ్మకు సెకండ్​ ప్రైజ్​లభించాయి. కార్యక్రమంలో డీడబ్ల్యుఓ బ్రహ్మాజీ, మెప్మా పీడీ ఇందిరా, డీసీఓ కరుణ, అడిషనల్ డీఆర్డీఓ సరస్వతి. జడ్పీ సీఈవో ఎల్లయ్య, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నరేందర్, కార్యదర్శి రాజ్ కుమార్ పాల్గొన్నారు.