మెదక్ ​చర్చిని సందర్శించిన ..చార్లెస్ ​వాకర్​ పాస్నెట్ ​మనవరాలు

మెదక్​టౌన్, వెలుగు: మెదక్ ​చర్చి నిర్మాత చార్లెస్​వాకర్​పాస్నెట్​మనవరాలు జూలియా, వారి బంధువులు ఎలిజబెత్, మైకేల్, క్యారెల్, ఫ్రాంక్లిన్ ఆదివారం చర్చిని సందర్శించారు. ప్రెసిబిటరీ ఇన్​చార్జి శాంతయ్య, చర్చి బాధ్యులతో మాట్లాడుతూ చర్చి నిర్మించి వందేళ్లు కావడస్తుండడంతో ఏర్పాట్ల గురించి ఆరాతీశారు. ఈ సందర్భంగా పాస్నెట్​మనవరాలితో పాటు వారి బంధువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చర్చి బాధ్యులు గంట సంపత్​, శాంసన్, సందీప్​ పాల్గొన్నారు.