జూలై 18వ తేదీ నుంచి జూలై 27వ తేదీ వరకు మాంసం దుకాణాలు బంద్ చేయాలని ఘజియాబాద్ డీఎం ఆదేశాలు జారీ చేశారు. 144 సెక్షన్ కింద ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, కన్వర్ యాత్ర వెళ్లే 500 మీటర్ల లోపు ఉన్న అన్నీ మాంసం దుకాణాలను మూసివేయాలన్నారు. దూదేశ్వరనాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న వాటిని కూడా తెరవకూడదన్నారు. యాత్ర వెళ్లే మార్గంలో మద్యం దుకాణాలు మూసి ఉండేలా చూడాలని గౌతమ్ బుద్ నగర్ జిల్లా మెజిస్ట్రేట్ LY Suhas వెల్లడించారు.
ఈద్, కన్వర్ యాత్ర సన్నాహాక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్ల నుంచి కన్వర్ యాత్ర నిర్వహించడం లేదనే సంగతి తెలిసిందే. రెండేళ్ల విరామం అనంతరం ఈ ఏడాది జూలై 14 నుంచి జూలై 26 వరకు కన్వర్ యాత్ర జరుగనుంది. ఈసారి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. జూలై 26వ తేదీన యాత్ర ముగుస్తుంది. ఆయా శివాలయాల్లో ఉత్తరాఖండ్ హరిద్వార్ లోని గంగా నది నీటిని సమర్పిస్తారు.
Meat shops on Kanwar Yatra route to remain shut: Haridwar administration
— ANI Digital (@ani_digital) July 19, 2022
Read @ANI Story | https://t.co/CAx5Xr8bwR#Haridwar #KanwarYatra #Uttarakhand pic.twitter.com/jjomjV6xde
