భారత జలాలలోకి వస్తే అంతు చూడటమే.. నేవీలోకి రెండు యుద్ధనౌకలు

దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు యుద్ధ నౌకలు ఐఎన్​ఎస్​ నీలగిరి(ఫ్రీగేట్), ఐఎన్​ఎస్​ సూరత్​(డిస్ట్రాయర్)లు నౌకాదళంలోకి చేరాయి. ఈ రెండు యుద్ధ నౌకలను మజగావ్​ డాక్స్​ షిప్​ బిల్డర్స్​ లిమిటెడ్​ (ఎండీఎల్​), ఇండియన్ నేవీకి చెందిన వార్​షిప్​ డిజైన్​ బ్యూరోలు సంయుక్తంగా దేశీయంగా అభివృద్ధి చేశాయి. 

ఐఎన్​ఎస్​ నీలగిరి

మజగావ్​ డాక్స్​ షిప్​ బిల్డర్స్​ లిమిటెడ్​ (ముంబయి), గార్డెన్ రీచ్​ షిప్​బిల్డర్స్​, ఇంజినీర్స్​ లిమిటెడ్​(కోల్​కతా)లు ప్రాజెక్ట్​ 17ఏ కింద నిర్మిస్తున్న ఏడు పీ17ఏ యుద్ధనౌకల్లో నీలగిరి మొదటిది. దీనిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇందులో అమర్చిన అధునాతన సాంకేతికత ఆయుధాలు, సెన్సర్ల ద్వారా శత్రుదేశాల జలంతర్గాములు, ఉపరితల యుద్ధనౌకలు, యాంటీ షిప్​ క్షిపణులు, యుద్ధ విమానాలను ఎదుర్కోగలదు. 

ఐఎన్​ఎస్​ సూరత్​ 

ప్రాజెక్ట్​ 15 బి కింది నిర్మిస్తున్న నౌకల్లో నాలుగోది ఐఎన్​ఎస్​ సూరత్.​ యుద్ధనౌక సూరత్​లో బ్రహ్మోస్​ క్షిపణులు, బరాక్​–8 మీడియం రేంజ్​ సర్ఫేస్​ టు ఎయిర్​ క్షిపణులు, దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ సబ్​ మెరైన్​ ఆయుధాలు, సెన్సార్లు అమర్చారు. 

ALSO READ | RRB Group D Recruitment: రైల్వేలో 32 వేల 438 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే