ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు

ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యూపీ ఫలితాలపై బిఎస్‌పి అధినేత్రి మాయావతి స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాల కంటే దారుణంగా మరొకటి ఉండదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలపై తాను నమ్మకం పెట్టుకున్నానని.... బాధపడ్డారు. ఇది బిఎస్‌పికి పెద్ద గుణపాఠమన్నారు మాయావతి. భవిష్యత్తులో వ్యూహాత్మక మార్పును తీసుకువస్తుందని తాను భావిస్తున్నట్లు మాయావతి అన్నారు. 

ముస్లిం, దళితుల ఓట్లు కీలకంగా ఉన్న యూపీలో ఓట్ల చీలిక లేకుండా ఉంటే యూపీలో మరో భిన్నమైన ఫలితం వచ్చేదన్నారు. ముస్లీంలు సమాజ్ వాదీ పార్టీ వెనుక నిలబడ్డారన్నారు. అగ్రవర్ణాలన్నీ బీజేపీకి అండగా ఉన్నాయన్నారు. బీఎస్పీ ప్రధాన ఓటు బ్యాంకు చీలిపోవడానికి ఇదే కారణమని మాయావతి అన్నారు. ఓటమి పై పార్టీ నేతలతో కలిసి విశ్లేషించుకున్నారు మాయావతి. ప్రజలు ఇంతలా తమపై వ్యతిరేకత చూపిస్తున్నట్లు తాము అంచనా వేయలేకపోయామని చెప్పుకొచ్చారు. 

ప్రస్తుత ఎన్నికల్లో బీఎస్పీకి కేవలం ఒక సీటు సాధించడం.. 12.8% తక్కువ ఓట్లతో అత్యల్ప స్థాయికి చేరుకుందన్నారు. తన పార్టీకి భవిష్యత్తు లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాయావతి. బీజేపీని ఓడించేందుకు ముస్లీంలు ఎస్పీకి ఓటేశారన్నారు. SP అధికారంలోకి వస్తే మరోసారి జంగిల్ రాజ్ వస్తుందన్న భయం BSP మద్దతుదారులు, అగ్రవర్ణ హిందువులు మరియు OBCలలో బీజేపీకి అండగా నిలిచారన్నారు. వారి ఈ తప్పుడు నిర్ణయం వల్ల మేం భారీగా నష్టపోయామన్నారు. 

ఇవి కూడా చదవండి:

గవర్నర్‌ను కలిసిన భగవంత్ మాన్

ఖైదీలకు సుశీల్ కుమార్ రెజ్లింగ్ పాఠాలు