IPL 2025 Mega Action: వేలంలో భారత ఓపెనర్లకు నిరాశ.. అప్పుడు కోట్లు.. ఇప్పుడు అన్‌సోల్డ్

ఐపీఎల్ రెండో రోజు మెగా ఆక్షన్ లో భారత ఓపెనర్లకు బిగ్ షాక్ తగిలింది. పృథ్వీ షా,మయాంక్ అగర్వాల్,అజింక్యా రహానేలకు  నిరాశే మిగిలింది. ఈ ముగ్గురు అన్‌సోల్డ్ లిస్ట్ లో చేరిపోయారు. కనీస ధర రూ. 75 లక్షల రూపాయలకు ఎవరు అతన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదు. షా పేలవ ఫామ్ తో ఫిట్ నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ కారణంగానే అతన్ని ఎవరూ కొనలేదని అర్ధమవుతుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన ఈ ముంబై యువ క్రికెటర్ విఫలమయ్యాడు. 

ALSO READ | IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్‌డేట్స్

టీమిండియా మాజీ కెప్టెన్ ఓపెనర్ అజింక్య రహానే  ఐపీఎల్ వేలంలో తొలిసారి అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. కనీస ధర కోటి రూపాయలకు అతన్ని ఎవరు సొంతం చేసుకోలేదు. రహానే ఐపీఎల్ 2024 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో అద్భుతంగా రాణించిన రహానే.. 2024 లో మాత్రం పేలవ ఆట తీరుతో నిరాశపరిచాడు. అతని నిదానంగా ఆట ఐపీఎల్ కు సరిపోవడం లేదు. ఎంతో అనుభవం ఉన్నప్పటికీ అతన్ని ఫ్రాంచైజీలు పక్కన పెట్టారు.

ALSO READ | IPL 2025 Mega Action: కనీస ధరకు కష్టంగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు RCB కెప్టెన్

విధ్వంసకర ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కు సైతం నిరాశ తప్పలేదు. కనీస ధర రూ. 1.5 కోట్లకు వేలంలోకి వచ్చిన ఈ భారత ఆటగాడిని తీసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు. 2024 ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ తరపున పెద్దగా రాణించలేదు. అంతకముందు పంజాబ్ కింగ్స్ తరపున రూ 14 కోట్ల ధరకు ఆడిన మయాంక్ ను ఇప్పుడు వేలంలో ఒక్కరు కూడా పట్టించుకోలేదు.