న్యూఢిల్లీ: కొత్త ఏడాది సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఆరంభానికి ఇది మంచి అవకాశం. కలసికట్టుగా పని చేసి అన్నింటినీ పరిష్కరిద్దాం. కరోనా సమయంలో తలెత్తిన సవాళ్లు మనం ఉమ్మడిగా పోరాడుతూ మరింత బలంగా ముందుకెళ్లేందుకు ఉపయోగపడ్డాయి’ అని కోవింద్ ట్వీట్ చేశారు.
Happy New Year everyone!
New Year provides an opportunity to make a fresh beginning and resolve for individual and collective development.
Challenges arising out of COVID-19 situation strengthen our determination to move forward unitedly.
— President of India (@rashtrapatibhvn) January 1, 2021
కొత్త ఏడాది అందరికీ మంచి ఆరోగ్యం, సుఖ సంతోషాలను కలిగించాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
Wishing you a happy 2021!
May this year bring good health, joy and prosperity.
May the spirit of hope and wellness prevail.
— Narendra Modi (@narendramodi) January 1, 2021
నూతన ఏడాదిలో కరోనాతో పోరాడేందుకు, దాన్ని ఓడించేందుకు పూర్తి నిబద్ధతతో ప్రవేశిద్దామని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ఈ సంవత్సరాన్ని ఉత్సాహం, సానుకూలతలతో స్వాగతిద్దామన్నారు.
ఈ నూతన సంవత్సరంలో కరోనా మహమ్మారితో పోరాడేందుకు, దాన్ని ఓడించేందుకు ఓ ఉన్నతమైన నిబద్ధతతో ప్రవేశిద్దాం. టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నందున 2021ని నూతన ఉత్సాహం, సానుకూలతలతో స్వాగతిద్దాం. #NewYear2021 #HappyNewYear2021
— Vice President of India (@VPSecretariat) January 1, 2021
కొత్త ఏడాది సమయంలో మన కోసం త్యాగాలు చేసిన, మనల్ని రక్షించడానికి ప్రాణాలొడ్డిన వారిని గుర్తు చేసుకుందామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అన్యాయపు శక్తులతో పోరాడుతున్న రైతులు, కార్మికులతో తన ఆలోచనలు ముడిపడి ఉంటాయన్నారు.
As the new year begins, we remember those who we lost and thank all those who protect and sacrifice for us.
My heart is with the farmers and labourers fighting unjust forces with dignity and honour.
Happy new year to all. pic.twitter.com/L0esBsMeqW
— Rahul Gandhi (@RahulGandhi) December 31, 2020
