- ఉప్పొంగే ఉత్సాహంతో ఆకాశాన్ని అందుకుందాం.. ఇదే మంచి అవకాశం..
- ఇదే మంచి తరుణం.. ఆకాశానికి నిచ్చెన వేద్దాం.. చంద్రుడిని అందుకుందామంటూ ప్రోత్సహించే విజేతలు
- స్వాతంత్ర దినోత్సవ వేళ భారత మాతకు నివాళిగా ‘‘మౌకా హై’’ పాట రిలీజ్ చేసిన టిసిరీస్
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులు జరుపుకుంటున్న శుభ తరుణంలో ఒలింపిక్స్ పతకాల విజేతలతో స్ఫూర్తిదాయకమైన పాటను విడుదల చేసింది టి.సిరీస్. ‘‘ఇదే మంచి అవకాశం.. ఉప్పొంగే ఉత్సాహంతో ఆకాశాన్ని అందుకుందాం.. ఇదే గొప్ప తరుణం.. ఆకాశానికి నిచ్చెన వేద్దాం..చంద్రుడిని అందుకుందామంటూ’’ ఉత్తేజపరుస్తూ ఒలింపిక్స్ పతకాల విజేతలతో ‘మౌకా హై ’ .. ‘‘ఇదే మంచి అవకాశం..’’ అని సాగే పాటను మనోజ్ ముంతాషిర్ రచించారు. గుండెలనిండా కొత్త ఉత్సాహాన్ని నింపేలా పాటను ఒలింపిక్స్ పతకాల విజేతలతోపాటు..మరికొందరిపై ఉత్సాహభరితంగా సాగేలా చిత్రీకరించారు. సరికొత్త ఉత్సాహాన్ని రేకెత్తించేలా సాగే ఈ పాటకు రోచక్ కోహ్లీ స్వరాలు సమకూర్చారు. హిందీలో ‘మౌకా హై’ అంటే.. ‘‘ఇదే గొప్ప అవకాశం’’ శీర్షికన విడుదల చేసిన ఈ గీతాన్ని బీ ప్రాక్ స్ఫూర్తి రగిలించేలా ఆలపించారు.
‘మౌకా హై’ పేరుతో సాగే ఈ పాటలో వివిధ రంగాలలో అశేష కనబరిచిన వ్యక్తులను చూపిస్తూ.. తమ కలలను సాకారం చేసుకునేందుకు కదలిరండి అంటూ స్ఫూర్తి రగిలించేలా చిత్రీకరించారు. ఈ ప్రత్యేక గీతం వీడియోలో ఒలింపిక్ విజేతలతోపాటు విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు, చేసే పనినిని అంకితభావంతో చేయాలనే స్ఫూర్తి కలిగిస్తారు. ఒలింపిక్స్ పతకాలు సాధించిన వారిలో అందరికీ చిరపరిచితురాలైన పీవీ సింధూ, మీరాభాయ్ చానూ, హిమ దాస్ తో పాటు ఇంకా అనేక మందిని చూపించే ప్రయత్నం చేశారు.
ప్రత్యేక గీతాన్ని విడుదల చేసిన సందర్బంగా దాల్మియా భారత్ గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా మాట్లాడుతూ ‘‘మౌకా హై’’ వీడియో భారత యువత ప్రతిభకు అద్దంపడుతుందన్నారు. కష్టాలు ప్రతిభను సానపడతాయని.. ఎలాంటి కష్టాలు ఎదురైనా నిరాశకు లోను కాకుండా... కష్టాలు ఎదురైతే మరింత పట్టుదలతో.. ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని ఆశాభావంతో ముందుకు సాగితే ఒలింపిక్స్ విజేతల మాదిరిగా మనం కూడా సూపర్ పవర్‌గా మారగలమనే నమ్మకాన్ని, ధీమాను పెంపొందిస్తుందని వివరించారు. యువతలోనే కాదు.. అందరిలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించి కార్యోన్ముఖుడిని చేసేందుకు దోహదపడే ఈ మ్యూజిక్ వీడియో కోసం టీ–సిరీస్‌తో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక గీతాన్ని తమ సంస్థ ద్వారా విడుదల చేయడం ఎంతో గర్వకారణంగా ఉందని టీ–సిరీస్ అధినేత భూషణ్ కుమార్ పేర్కొన్నారు. ‘‘మౌకా హై’’ మ్యూజిక్ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు సంతోషంతో గర్వంగా పొంగిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు, బాధలు ఎదురైనా వాటన్నింటినీ అధిగమిస్తూ ఒలింపిక్స్ పతకాలు సాధించిన విజేతల స్ఫూర్తి.. పిల్లల నుండి వయో వృద్ధుల వరకు అన్ని రంగాల్లోని వారికీ స్ఫూర్తి కలిగిస్తుందన్నారు.
