Australia cricket: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియ తాత్కాలిక కెప్టెన్ రిటైర్మెంట్

అంతర్జాతీయ క్రికెట్ కు మరో స్టార్ క్రికెటర్ వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్-బ్యాటర్ మాథ్యూ వేడ్ మంగళవారం (అక్టోబర్ 29) అంతర్జాతీయ క్రికెట్ నుండి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది ప్రారంభంలో టీ20 ప్రపంచకప్‌లో వేడ్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ లో లీగ్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కు కంగారూల జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. 

ఆసీస్ టీ20 జట్టుకు వేడ్ తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించాడు. 2023లో టీ20లో చివరిసారిగా ఆస్ట్రేలియా కెప్టెన్ గా జట్టును నడిపించాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా ఫ్రాంచైజీ క్రికెట్ లో కొనసాగుతానని వేడ్ తెలిపాడు. వచ్చే నెలలో ఆస్టేలియాలో జరగబోయే దేశవాళీ టీ20 లీగ్ లో బిగ్ బాష్ లీగ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతను ఆసీస్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరిస్తాడు.

ALSO READ : పాకిస్తాన్ కోచ్‌‌‌‌ పోస్టుకు కిర్‌‌‌‌‌‌‌‌స్టన్‌‌‌‌ రాజీనామా

2011 లో వేడ్ టీ20 క్రికెట్ ద్వారా అరంగేట్రం చేశాడు. తన కెరీర్ లో మొత్తం ఆసీస్ తరపున అన్ని ఫార్మాట్ లలో 225 మ్యాచ్ లాడాడు. 13 ఏళ్ళ పాటు ఆస్ట్రేలియా క్రికెట్ లో వికెట్ కీపర్ బ్యాటర్ గా సేవలను అందించాడు. 36 టెస్టుల్లో 1613 పరుగులు.. 97 వన్డేల్లో 1867 పరుగులు.. 92 టీ20ల్లో 1202 పరుగులు చేశాడు. టెస్టుల్లో నాలుగు సెంచరీలు... వన్డేల్లో సెంచరీ అతని ఖాతాలో ఉన్నాయి.