ఇదేందయ్యా ఇది.. ఏడా సూడలే..! ఉపాధ్యాయుడికి ప్రసూతి సెలవు

పాట్నా: బిహార్‌‌‌‌లోని ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి వారం రోజులు ప్రసూతి సెలవులు మంజూరు చేశారు. దీనికి సంబంధించి టీచర్ల ఆన్​లైన్ లీవ్స్ పోర్టల్‎లోని స్క్రీన్​షాట్‎లు సోషల్ మీడియాలో వైరల్​అవుతుండడంతో విద్యాధికారులు స్పందించారు. ఉపాధ్యాయుడు జితేంద్ర కుమార్​సింగ్​లీవ్ విషయంలో టెక్నికల్ ఎర్రర్ చోటుచేసుకుందని అతనికి ప్రసూతి సెలవు ఇవ్వలేదని వైశాలి జిల్లా మహువా బ్లాక్‌‌‌‌ ఇన్​చార్జ్ ​విద్యాధికారి అర్చన కుమారి తెలిపారు. ప్రసూతి సెలవులు మహిళా టీచర్లకు మాత్రమే ఇస్తారని.. అయితే పురుష టీచర్లకు పితృత్వ సెలవులు(పెటర్నిటీ లీవ్) తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ వ్యవహారంలో ఎటువంటి తప్పు జరగలేదని.. పోర్టల్‎లో సెలవు ఫార్మాట్​తప్పుగా నమోదవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. ఈ సాంకేతిక పొరపాటును సరిచేస్తున్నామని తెలిపారు.