ఏడుపాయల్లో గాయత్రి దేవీగా వనదుర్గామాత

పాపన్నపేట, వెలుగు : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం ఏడుపాయల్లో వన దుర్గా భవానీ మాతను గులాబీ రంగు వస్త్రాలతో గాయత్రీ దేవీగా అలంకరించారు. వేకువ జాము నుంచి ఆలయ పూజారులు శంకర్ శర్మ, పార్థీవశర్మ, రాజ శేఖర్ శర్మ రాజగోపురంలోని అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించారు. అనంతరం గోకుల్ షెడ్ లో సైతం అమ్మవారిని గాయత్రీ దేవీగా అలంకరించారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.