సీఏ ఫలితాల్లో మాస్టర్‌‌మైండ్స్‌‌ ప్రతిభ

హైదరాబాద్, వెలుగు: ఏసీఏఐ ప్రకటించిన సీఏ ఫలితాల్లో తమ సంస్థకు చెందిన నలుగురు విద్యార్థులు జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకులు పొందినట్లు  మాస్టర్‌‌మైండ్స్‌‌ విద్యాసంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. మాస్టర్‌‌మైండ్స్‌‌ లో చదివిన రిషబ్ ఓత్సవాల్ అనే విద్యార్థి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు.

అంతేగాక.. ఆల్ ఇండియా 33వ ర్యాంక్, 34వ ర్యాంక్, 40వ ర్యాంక్ కూడా మాస్టర్‌‌మైండ్స్‌‌ స్టూడెంట్లే సాధించారని చెప్పారు. మొదటి 50 ర్యాంకుల్లో తమ   విద్యార్థులే 4 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారని వివరించారు. వివిధ కామర్స్ కోర్సుల్లో మాస్టర్‌‌మైండ్స్‌‌ ఇప్పటిదాకా 50 సార్లకు పైగా ఫస్ట్ ర్యాంక్ సాధించిందని గుర్తుచేశారు. మంచి ఫలితాలు రావటానికి సహకరించిన మాస్టర్‌‌మైండ్స్‌‌ సిబ్బందికి, విద్యార్థులకు, వారి పేరెంట్స్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మట్టుపల్లి మోహన్ పేర్కొన్నారు.