సినీ రేంజ్‎లో రోడ్డు యాక్సిడెంట్.. ఒకేసారి 8 కార్లు, 2 బస్సులు, 4 లారీలు ఢీ

చెన్నై: తమిళనాడులో  సినీ రేంజ్‎లో రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలోని పేరండ్లపల్లి వద్ద బెంగుళూరుచెన్నై హైవేపై వరుసగా 8 కార్లు, రెండు బస్సులు, నాలుగు లారీలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడగా.. అందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించారు.

ALSO READ | యెమెన్ సముద్రంలో మునిగిన వలస బోటు..13మంది మృతి, 14 మంది గల్లంతు

 ఈ యాక్సిడెంట్ వల్ల బెంగుళూరుక్రిష్ణగిరి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు.. వాహనాల రద్దీని క్లియర్ చేశారు. ఓ లారీ బ్రేక్ ఫెయిల్ కావడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని రద్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.