అమ్రాబాద్​ అడవిలో మంటలు

అమ్రాబాద్, వెలుగు:   అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని పరహాబాద్, బౌరాపూర్, రాంపూర్ పెంటల అడవిలో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. శాటిలైట్ ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అలెర్ట్ అయ్యారు. పరహాబాద్ వద్ద ఉన్న 15 మంది ఫైర్ సిబ్బంది, 15 మంది బేస్ క్యాంప్ వాచర్లు సుమారు 5 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.    ఈ క్రమంలో సుమారు 8 హెక్టార్ల మేర ఎండుగడ్డి దహనం అయినట్లు మన్ననూర్ రేంజర్ ఈశ్వర్ పేర్కొన్నారు.