కోకాపేటలో భారీ అగ్ని ప్రమాదం: అపార్టుమెంటులో చెలరేగిన మంటలు..

కోకాపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట్ నియో పోలీస్ దగ్గర మై హోమ్ నిషేధ సాడ్ సర్కిల్ లో నిర్మాణంలో ఉన్న మై హోమ్ గ్రూప్స్ అపార్ట్మెంట్లో ఒక్కసారిగా చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అపార్టుమెంటు మొత్తాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. శుక్రవారం ( జనవరి 3, 2025 ) జరిగిన ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. 

స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చే పనిలో పడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.