బుద్వేల్ రైల్వే స్టేషన్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం.. మెకానిక్ షెడ్లు పూర్తిగా దగ్ధం..

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. జిల్లాలోని బుద్వేల్ రైల్వే స్టేషన్ వద్ద లారీ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ( జనవరి 5, 2025 ) చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న లారీ పార్కింగ్ లో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మెకానిక్ షెడ్లు పూర్తిగా దగ్దమైనట్లు తెలుస్తోంది. ఘటనాస్థలి దగ్గర భారీగా ఏగసి పడుతున్న మంటలు ఎగసి పడుతున్నాయి.

మంటలకు తోడు గాలి కూడా ఎక్కువగా వీస్తుండటంతో దట్టమైన పొగ అలుముకుంది.. షార్ట్ సర్క్యూట్‌తో ఒకసారిగా మంటలు చెలరేగి మెకానిక్ షెడ్లు పూర్తిగా దగ్ధమయ్యాయని స్థానికులు తెలిపారు. స్థానికులు వెంటనే సమాచారం అందించటంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు.ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.