భూకంపానికి కుప్పకూలిన నేపాల్..32మంది మృతి

నేపాల్ భూకంపం బీభత్సం సృష్టించింది. టిబెట్ నేపాల్ సరిహద్దుల్లో మంగళవారం (జనవరి 7) ఉదయం 6.35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రత నమోదు అయింది. భూకంపం కారణంగా 32 మంది చనిపోయారు. భూకంప ధాటికి ఇళ్లు నేలమట్టమయ్యాయి. 

యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంప కేంద్రం నేపాల్లోని లోబుచేకి వద్ద 93 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది. నేపాల్ లో రెండుసార్లు భూప్రకంపనలు ఏర్పడ్డాయి. మరోవైపు బీహార్ తోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు ఏర్పడ్డాయి.