ప్రారంభం కానున్న సినిమా థియేటర్లుకు గైడ్ లైన్స్ ఇవే..

ప్రారంభం కానున్న సినిమా థియేటర్లుకు గైడ్ లైన్స్ ఇవే..

దేశంలో  అక్టోబర్ 15 నుండి 50% శాతం సీట్ల సామర్ధ్యంతో సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కేంద్రం థియేటర్ల యాజమాన్యాలకు పలు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సీట్ల మధ్య తప్పని సరి దూరంతో పాటు కరోనా పై అవగాన కల్పించేలా అడ్వటైజ్మెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. భౌతిక దూరం పాటించడం, చేతుల్ని శానిటైజ్ చేసుకోవడం, థర్మల్ స్క్రీనింగ్ తో పాటు కరోనా వైరస్ లేని ప్రేక్షకుల్ని థియేటర్ లలోకి అనుమతిస్తున్నట్లు చెప్పారు.

చేతులు కడుక్కోవడానికి తగిన సదుపాయాలు ఉండాలని, థియేటర్లలో హ్యాండ్ శానిటైజర్లను ఉంచాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.  సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రమే ఓపెన్ చేయాలని జవదేకర్ థియేటర్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.

ఆరోగ్య సేతు యాప్ వాడకం అందరికీ సూచించబడాలి, థియేటర్ ప్రాంగణంలో ఉమ్మివేయడం నిషేదించడంతో పాటు ఫుడ్ కౌంటర్లలో, ప్యాక్ చేయబడిన ఆహారం మరియు పానీయాలు మాత్రమే అనుమతించబడతాయి. సినిమా హాల్ లోపల స్నాక్స్ పంపిణీ అనుమతించబడదు.

ఇక థియేటర్ సిబ్బందికి తప్పని సరిగా పీపీఈ కిట్లను అందించాలని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ సినిమా థియేటర్ యాజమాన్యాల్ని ఆదేశించారు.