ఒలింపిక్స్ 2020 క్వాలిఫయర్స్ కోసం జరిగిన ఉమెన్స్ బాక్సింగ్ ట్రయల్స్ బౌట్ లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పై.. లెజెండరీ బాక్సర్ మేరీకోమ్ విజయం సాధించింది. ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన మేరీకోమ్ తో 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ పట్టుబట్టి మరీ రింగ్ లోకి దిగింది. ఈ పోటీలో 9-1 తేడాతో నిఖత్ ను మేరీకోమ్ ఓడించింది.
సెలెక్షన్ పాలసీ రూల్స్ ను పక్కన పెట్టి.. 51 కేజీల విభాగంలో మేరీకోమ్ ను ఒలింపిక్స్ కోసం సెలెక్ట్ చేస్తామని ఇండియా బాక్సింగ్ పెడరేషన్ ప్రకటించడం అప్పట్లో దుమారం రేపింది. దీనిని సవాల్ చేస్తూ.. కేంద్ర క్రీడా శాఖకు నిఖత్ జరీన్ లెటర్ రాసింది. మేరీకోమ్ తో తనకు సెలెక్షన్స్ ట్రయల్స్ నిర్వహించాలని కోరడంతో.. ఈ పోటీ నిర్వహించారు. గెలిచి సమాధానం చెబుతానని ముందే చెప్పిన మేరీకోమ్… గెలిచాక వివాదంపై స్పందించింది. నిఖత్ జరీన్ అనవసరంగా ఇష్యూ చేసిందని చెప్పింది. తనకు రెస్పెక్ట్ ఇస్తే .. తాను ఆమెకు రెస్పెక్ట్ ఇస్తానని చెప్పింది మేరీ.
