ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు

రంగారెడ్డి జిల్లాలో 2024 మార్చి 18న సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారుతి ఈకో వ్యాన్ ప్రయాణంలో అదుపు తప్పి.. పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను షాద్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

వీరంతా బెంగళూరు నుంచి కాశీకి వెళ్తున్నట్లు తెలిసింది. షాద్ నగర్ జాతీయ రహదారిపై ఎంఎస్ఎన్ పరిశ్రమ ముందు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.