బ్రేక్‌‌ ప్రాబ్లమ్స్‌‌..మారుతి సుజుకీ రీకాల్

 బ్రేక్‌‌ ప్రాబ్లమ్స్‌‌..మారుతి సుజుకీ రీకాల్

న్యూఢిల్లీ: బ్రేక్‌‌ ప్రాబ్లమ్స్‌‌ ఉన్నాయనే కారణంతో మూడు మోడల్స్‌‌కు చెందిన 9,925 యూనిట్లను మారుతి సుజుకీ రీకాల్ చేస్తోంది. వెనుక బ్రేక్‌‌ల అసెంబ్లీ పిన్‌‌లో సమస్యలు ఉండొచ్చనే అనుమానంతో  వ్యాగన్ ఆర్‌‌‌‌, సెలెరియో, ఇగ్నిస్  కార్లను  రీకాల్ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది.  ఈ ఏడాది ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 1 మధ్య తయారైన కార్లలో మాత్రమే ఈ సమస్య ఉండొచ్చని  కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో పేర్కొంది.  వెనుక బ్రేక్‌‌లో సమస్యలు ఉండొచ్చనే అనుమానిస్తున్నామని,  ఫలితంగా మూడు మోడళ్ల  కార్ల బ్రేక్ పెర్ఫార్మెన్స్ తగ్గొచ్చని మారుతి తెలిపింది. వెనుక బ్రేక్ నుంచి సౌండ్‌‌ రావొచ్చని పేర్కొంది.  కస్టమర్ల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని  అనుమానిస్తున్న కొన్ని మోడళ్ల కార్లను రీకాల్ చేస్తున్నామని, సమస్య ఉన్న పార్టులను ఫ్రీగా రీప్లేస్ చేస్తామని వివరించింది.  రీప్లేస్ చేయాల్సిన పార్టులను అందుబాటులో ఉంచామని, అథరైజ్డ్ వర్క్‌‌షాప్‌‌లు కస్టమర్లను కాంటాక్ట్‌‌ చేస్తారని పేర్కొంది.

రెండో స్థానంలో యూపీ

ఈ ఏడాది మహారాష్ట్రలో అత్యధికంగా పటాకుల అమ్మకాలు నమోదయ్యాయని టీఏఎన్​ఎఫ్​ఏఎంఏ తెలిపింది. ఉత్తరప్రదేశ్, -బీహార్, గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  ముంబైతో పాటు మిగిలిన మహారాష్ట్ర మొత్తం ఉత్పత్తిలో పెద్ద భాగాన్ని కొనుగోలు చేసిందని గణేశన్ చెప్పారు.  పర్యావరణ నియమాలు,  సుప్రీంకోర్టు,  ప్రభుత్వ అధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా టపాసులను తయారు చేశామని చెప్పారు. బాణసంచా తయారీలో బేరియం నైట్రేట్ వాడకాన్ని అనుమతించడం లేదు కాబట్టి ,   స్ట్రోంటియం నైట్రేట్,  ఇతర ఆక్సిడైజింగ్ ఏజెంట్లకు మారిపోయామని ఆయన అన్నారు.  ‘‘ స్ట్రోంటియం వంటి వాటితో మాకు చాలా పెద్ద సమస్య ఉంది. ఎందుకంటే వీటి మన్నిక చాలా తక్కువగా ఉంటుంది. త్వరగా పాడవుతాయి. దీంతో పటాసులు తయారీ చాలా శ్రమతో కూడిన పని’’  అని పేర్కొన్నారు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని శివకాశి ప్రాంతం బాణాసంచా పరిశ్రమకు జాతీయ కేంద్రమనే విషయం తెలిసిందే. అయ్యన్ ఫైర్‌‌‌‌వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ అబీరుబెన్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం అమ్మకాలు చురుగ్గా ఉన్నాయని, గ్రీన్ క్రాకర్ల ఉత్పత్తి, అమ్మకాలు బాగున్నాయని చెప్పారు. ఈరకం క్రాకర్స్ వల్ల ఉద్గారాలు 35శాతం తగ్గుతాయని చెప్పారు. ఎక్కువ మంది ఏవి కొన్నారన్న ప్రశ్నకు.. ఆకాశంలో వెలుగులు విరజిమ్మే 'షాట్స్' బాగా అమ్ముడయ్యాయని జవాబిచ్చారు.  ఎక్కువ మంది  కాంతిని ఇస్తూ పేలే బాణసంచా రకాలను ఎంచుకుంటున్నారని వివరించారు. చిచ్చుబుడ్లు,  భూచక్రాలు, కాకరవత్తులు,  రాకెట్లు బాగా అమ్ముడుపోయాయని అబీరుబెన్​ వివరించారు. కాలుష్యం ఎక్కువగా ఉండటంతో ఢిల్లీలో పటాకుల వాడకంపై నిషేధం విధించారు. రాజధాని మినహా దాదాపు అన్ని చోట్ల నుంచి వీటికి మంచి డిమాండ్ వచ్చింది.   క్రాకర్లలో బేరియం నైట్రేట్ వాడకంపై సుప్రీం కోర్టు 2018లో నిషేధం విధించిన తర్వాత, దాని వాడకం ఆగిపోయింది. ఇదిలా ఉంటే  గతేడాదితో పోల్చితే  బాణసంచా ధరలు మండిపోయాయి . పిల్లల ఆనందం కోసం తగ్గించి కొంతస్థాయిలో టపాసులు కొంటున్నామని పేరెంట్స్​ తెలిపారు. ధరలు దాదాపు 50 శాతం పెరిగాయని వ్యాపారులు చెప్పారు.