మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు

మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు
  • రూ.15 వేల వరకు పెరిగిన స్విఫ్ట్, అన్ని సీఎన్జీ మోడల్ కార్లు

ముంబై: కొత్తగా కారు కొనాలనుకునే వారికి మారుతీ సుజుకీ కంపెనీ షాక్ ఇచ్చింది. తమ కంపెనీ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్ కారుతో పాటు సీఎన్జీలో వస్తున్న మోడల్స్ కార్లపై రూ.15వేల వరకూ రేట్ పెరిగింది. గత నెల 21నే ఈ ధరల పెంపు గురించి బాంబే స్టాక్ ఎక్సేంజ్‌కు సమాచారం ఇచ్చిన కంపెనీ, కొత్త ధరలను ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తుందని సోమవారం ప్రకటించింది. ఇన్ పుట్ కాస్ట్ పెరగటంతో కార్ల ధరలు పెంచుతున్నామని, పెరిగిన ధరలు వస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే షోరూంలకు చేరిన కార్లపై కూడా రేట్ల పెంపు వర్తిస్తుందని చెప్పింది. మారుతీ సుజుకీ పెట్రోల్ మోడల్ కార్ల ధరలు కూడా మరికొద్ది రోజుల్లో పెరగనున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి కంపెనీ అధికారికంగా ప్రకటన చేయనున్నదని తెలిసింది. ప్రస్తుతం మారుతీ సుజుకీ ఆల్టో, ఎస్‌ప్రెసో, సెలెరో, వ్యాగనార్, ఎకో, ఎర్టిగా కార్లు సీఎన్జీ మోడల్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. షిఫ్ట్, డిజైర్, విటారా బ్రెజా కార్లకు సీఎన్జీ ఆప్షన్ లేదు.