చిన్న డీజిల్‌‌ కార్లకు మారుతి గుడ్‌‌బై!

చిన్న డీజిల్‌‌ కార్లకు మారుతి గుడ్‌‌బై!

సీఎన్‌‌జీ వెహికల్స్ ‌కు ప్రాధాన్యం

న్యూఢిల్లీ:  బీఎస్‌‌ 6 డీజిల్‌‌ ఇంజిన్‌‌తో  చిన్న కార్లను తీసుకు రావడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని మారుతి సుజుకీ ప్రకటించింది. మార్కెట్లో వీటికి పెద్దగా డిమాండ్‌‌ లేదని, ఫైనాన్షియల్‌‌గా ఎటువంటి లాభం ఉండదని పేర్కొంది. డీజిల్‌‌ కార్ల నుంచి పెట్రోల్‌‌ మోడల్స్‌‌కు మార్కెట్‌‌ నెమ్మదిగా షిఫ్ట్‌‌ అవుతోందని పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ ఎటువంటి డీజిల్‌‌ వెహికల్స్‌ను రెడీ చేయడం లేదు. డీజిల్‌‌కు బదులుగా సీఎన్‌‌జీ సెగ్మెంట్‌‌లో ప్రొడక్టులను తీసుకురావడంపై కంపెనీ ఎక్కువగా దృష్టి సారించింది. హ్యాచ్‌‌బ్యాక్‌‌ సెగ్మెంట్‌‌లో డీజిల్‌‌ కార్ల వాటా 5 శాతం కంటే తక్కువగానే ఉందని  మారుతి సుజుకీ ఎగ్జిక్యూటివ్‌‌ డైరక్టర్‌‌‌‌(సేల్స్‌‌) శశాంక్‌‌ శ్రీవాస్తవ అన్నారు. సెడాన్స్‌‌, ఎంట్రీ లెవెల్‌‌ ఎస్‌‌యూవీ సెగ్మెంట్‌‌లలో కూడా వీటి వాటా గణనీయంగా తగ్గుతోందని చెప్పారు. కాగా, డీజిల్‌‌ ధరలు భారీగా పెరగడంతోనూ డీజిల్‌‌ కార్లకు డిమాండ్‌‌ తగ్గుతోంది.