Legends League Cricket: హోరెత్తించిన కివీస్ ప్లేయర్.. 12 బంతుల్లో 9 సిక్సర్లతో విధ్వంసం

న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తన విధ్వంసాన్ని ప్రపంచ లీగ్ ల్లో కొనసాగిస్తున్నాడు. లెజెండ్స్ లీగ్ లో భాగంగా బుధవారం (అక్టోబర్ 2) జరిగిన మ్యాచ్ లో సునామీ ఇన్నింగ్స్ ఆడి మెరుపు సెంచరీ చేశాడు. నవీన్ స్టీవర్ట్ వేసిన ఓవర్‌లో 5 సిక్సర్లు.. ఒక ఫోర్ ఏకంగా 34 పరుగులు రాబట్టి స్టేడియాన్ని హోరెత్తించాడు. తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన ఈ కివీస్ ప్లేయర్.. నాలుగో బంతిని ఫోర్ కొట్టాడు. ఇదే ఊపులో చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. 

ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 6 బంతుల్లో మరో నాలుగు సిక్సర్లు.. ఒక ఫోర్ కొట్టాడు. మొత్తం 12 బంతుల్లోనే 9 సిక్సర్లు.. 2 ఫోర్లు కొట్టి అసలైన ఊచ కోత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో మొత్తం  54 బంతుల్లోనే 131 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 11 సిక్సర్లు, 9 ఫోర్లున్నాయి. అంతకముందు జరిగిన మ్యాచ్ లో క్రిస్టియన్ బౌలింగ్ లో ఒకే ఓవర్ లో 30 పరుగులు కొట్టి ఈ టోర్నీలో ఒకే ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ నిలిచాడు. తాజాగా బుధవారం స్టువర్ట్ ఓవర్ లో 34 పరుగులు చేసి తన రికార్డ్ తానే బ్రేక్ చేసుకున్నాడు. 

Also Read:-102 డిగ్రీల జ్వరంతో టీమిండియా ఆల్ రౌండర్ బ్యాటింగ్

గప్టిల్ విధ్వంసంతో సూరత్‌లోని లాలాభాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తన జట్టు సదరన్ సూపర్ స్టార్స్.. కోణార్క్ సూర్యస్ ఒడిశాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోణార్క్ సూర్యస్ ఒడిశా నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోర్ చేసింది.