పత్తి కొనుగోళ్లకు సర్వం సిద్ధం

పత్తి కొనుగోళ్లకు ఆదిలాబాద్​లోని మార్కెట్ యార్డు సర్వం సిద్ధమైంది. ఈనెల 23 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మకాలకు వచ్చే రైతుల కోసం అధికారులు అన్ని సదుపాయాలు కల్పించారు. మార్కెట్​లో మంచినీటితో పాటు రాత్రి వేళల్లో బసచేయడానికి గెస్ట్ హౌస్​లో ప్రత్యేకంగా బెడ్లు, పత్తి వాహనాలపై నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ కాంటాలతో పాటు వెయిట్ మెషీన్లను సిద్ధం చేశారు.- వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్