ఇండియా ఎఫెక్ట్ : 72 శాతానికి ప‌డిపోయిన చైనా స్మార్ట్ ఫోన్స్ అమ్మ‌కాలు

ఇండియా ఎఫెక్ట్  : 72 శాతానికి ప‌డిపోయిన చైనా స్మార్ట్ ఫోన్స్ అమ్మ‌కాలు

అన్ని వ్యాపారా ల మాదిరే స్మార్ట్ ఫోన్ బిజినెస్ ను కూడా కరోనా దెబ్బకొట్టిం ది. అమ్మకాలు విపరీతంగా పడిపోయాయి. గత నెల 31తో ముగిసిన మొదటి క్వార్ట‌ర్ సేల్స్ 51 శాతం పడిపోయాయి.అంటే గత ఏడాది క్యూ1 అమ్మకాల్లో ఇవి సగమే కావడం గ‌మ‌నార్హం. ఈ మూడు నెలల్లోకంపెనీలు 1.8 కోట్లయూనిట్లుమాత్రమే అమ్మాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్ల‌డించింది.

ఏప్రిల్లో అయితే ఒక్క షిప్ మెంట్ కూడా రాలేదు. అన్నిరాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ ఉండటం, కరోనా కేసులు ఎక్కువ కావడమే ఇందుకు కారణం. పరిస్థితి ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తోందని స్మార్ట్ ఫోన్ కంపెనీలు చెబుతున్నాయి . కరోనా ఇన్ఫెక్షన్ వస్తుందనే భయంతో జనం ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ కు మళ్లుతున్నా రు. దీంతో కంపెనీలు కూడా ఎక్కువ స్టాకును ఆన్లైన్లో ఉంచుతున్నాయి.

మార్చి క్వార్టర్ ఫర్వాలేదు..

స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఈ ఏడాది మార్చి క్వార్ట‌ర్ లో 3.1 కోట్లయూనిట్లను అమ్మాయి. 2019 జూన్ క్వార్ట‌ర్ లో ఇవి 3.7 కోట్లుగా రికార్డయ్యాయి . ‘‘లాక్ డౌన్ వ‌ల్ల దాదాపు 40 రోజుల పాటు ఫోన్ల తయారీ ఆగిపోయింది. అమ్మకాలు విపరీతంగా తగ్గాయి . ఆన్ లైన్ పక్రియ‌ మొదలుకాగానే ఫోన్లఅమ్మకాలు పుంజుకున్నాయి”అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఎనలిస్ట్ ప్రచీర్ సింగ్ అన్నారు.
జూన్ క్వార్టర్లో డిమాండ్ తో పాటు సప్లై త‌గ్గింది. ఏప్రిల్లో స్మార్ట్ ఫోన్ మేకింగ్ ఫ్లాంట్ లు మూత‌బ‌డ్డాయి. ఇవి తిరిగి మే నెలలో తెరుచుకున్నాయి. దీంతో కొన్నిబ్రాండ్లు తగినంత స్టాకును అందించలేకపోయాయి. మరికొన్నిఫుల్లీ అసెంబుల్డ్ సెట్లను విదేశాల నుంచి తెప్పించి అమ్మాయని సింగ్
వివరించారు. అయితే చైనా వంటి దేశాల నుంచే వచ్చిన స్మార్ట్ ఫోన్లు, విడిభాగాలకు క‌ష్ట‌మ‌ర్ క్లియ‌రెన్స్ రావ‌డం ఇబ్బందిగా మారింది. దీంతో సప్లై చెయిన్ దెబ్బతిన్నది.

తిరుగులేని షావోమీ

కరోనా కాలంలోనూ షావోమీ నంబర్ వన్ గా నిలిచింది. ఇది జూన్ క్వార్ట‌ర్ లో 29 శాతం మార్కెట్ వాటా సాధించింది. శామ్ సంగ్ కు 26 శాతం, వివోకు 17 శాతం, రియల్మీకి 11 శాతం, ఒప్పోకు తొమ్మిది శాతం మార్కెట్ వాటా ఉంది. రూ.30 వేలకుపైగా రేట్లున్న ఫోన్ల సెగ్మెంట్ లో వ‌న్ ప్ల‌స్ మొదటి స్థానానికి ఎగబాకింది. రూ.45 వేలకు పైబడిన ఫోన్లలో ఆపిల్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయితే, మార్చి క్వార్ట‌ర్ లో చైనీస్ ఫోన్ బ్రాండ్ల మార్కెట్ వాటా 81 శాతం ఉండగా,
జూన్ క్వార్టర్ లో ఇది 72 శాతానికి పడిపోయిందని కౌంటర్ పాయింట్రీకి చెందిన రీసెర్చ్ శిల్పి జైన్ అన్నారు. ఒప్పో, వివో, రియల్మీ వంటి కంపెనీలు సప్లై సమస్యలు ఎదు ర్కొన్నా యని చెప్పారు. యాంటీ–చైనా సెంటిమెంట్ వ‌ల్ల కొంత‌మంది చైనా స్మార్ట్ ఫోన్ల‌కు దూర‌మ‌య్యార‌ని తెలియ‌జేశారు.

క‌ష్ట‌మ్స్ ఆఫీస‌ర్ల ఆఫీసర్లుఎక్కువ నిఘా ఉంచడం వల్ల చైనా నుంచి ప్రొడక్టులు రావడం ఆలస్యమవుతోందని వివరించారు. చైనా కంపెనీలు ఇండియాలోనే ఫోన్లు తయారు చేయడం, ఇక్కడి ఆర్ అండ్ డి సెంటర్ల ను నిర్వహించడం, భారీగా రిటైలర్లు ఉండటంతో క‌ష్ట‌మ‌ర్ల‌కు ఇతర కంపెనీల ఫోన్లు లభించడం కష్టమవుతోంది. ఒక మొబైల్ ఫోన్ తయారు చేయడానికి చాలా దేశాల నుంచి వచ్చిన కాంపోనెంట్స్ వాడతారని, అది ఫలానా దేశంలో తయారైన ఫోన్ అని చెప్పడం సాధ్యం కాదని శిల్పి అన్నారు. అయితే శామ్ సంగ్ వంటి కొరియా కంపెనీల తోపాటు మైక్రోమాక్స్ , లావా వంటి స్మార్ట్ ఫోన్ కంపెనీలు మార్కెట్ రేటును పెంచుకోవడానికి ఇదే తగిన సమయమని ఆమె అన్నారు. జియో–గూగుల్ పార్ట్ న‌ర్ షిప్ వ‌ల్ల త‌క్కువ ధరకే 4జీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావొచ్చని ఆమె వివరించారు.