AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపైనే ప్రస్తుతం భారత జట్టు దృష్టి మొత్తం ఉంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే ఆస్ట్రేలియాపై ఈ సిరీస్ ను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. న్యూజిలాండ్‌పై భారత్ 3-0తో వైట్‌వాష్ అయిన తర్వాత రోహిత్ సేన టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైనల్ పోరుకు అర్హత సాధించాలంటే, ఆస్ట్రేలియా ప‌ర్యట‌న‌ చావో రేవో లాంటిది. బోర్డర్ గ‌వాస్కర్ ట్రోఫీని 5-0 లేదా 4-0 తేడాతో సిరీస్ ద‌క్కించుకుంటే, తప్ప ముందుకెళ్లే దారుల్లేవ్. అలాకాకుండా కంగారూల జట్టు ట్రోఫీని అందుకుంటే.. మనం ఆశ‌లు వదులుకోవాల్సిందే.

ఈ టోర్నీలో ఆస్ట్రేలియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. సొంతగడ్డపై కానుండడం కంగారులకు కలిసి రానుంది. మరోవైపు టీమిండియా పేలవ ఫామ్ లో ఉంది. రోహిత్ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడం.. కోహ్లీ పేలవ ఫామ్ లో ఉండడం.. అనుభవం లేకపోవడం.. షమీ లాంటి సీనియర్ ఫాస్ట్ బౌలర్ గాయంతో సిరీస్ కు దూరం కావడం లాంటి విషయాలు భారత్ ను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మార్క్ వా.. ఆస్ట్రేలియాలో భారత్ సిరీస్ గెలవగలదని.. రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా మాత్రమే సిరీస్ గెలిపించగలరని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. 

ALSO READ | IND vs SA 3rd T20I: తిలక్ నా స్థానం కావాలని అడిగాడు.. అందుకే త్యాగం చేశా: సూర్య

ప్రస్తుతం రిషబ్ పంత్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. దీనికి తోడు ఆస్ట్రేలియాపై మంచి రికార్డ్ ఉంది. చివరిసారి ఆస్ట్రేలియాలో భారత్ సిరీస్ గెలవడంతో పంత్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు బుమ్రా ప్రపంచ క్రికెట్ లో అత్యంత నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో వీరిద్దరిపై ఈ సారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారీ అంచనాలున్నాయి. సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది.