AUS vs PAK: ఇతడినా లక్నో వదులుకుంది: స్టోయినిస్ దెబ్బకు స్టేడియం దాటిన బంతి

ఐపీఎల్ మెగా ఆక్షన్ కు ముందు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ దుమ్మురేపాడు. పాకిస్థాన్ తో జరిగిన మూడో టీ20లో మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఆసీస్ వీరుడు మొత్తం 27 బంతుల్లో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు.. 5 సిక్సర్లు ఉన్నాయి. స్టోయినిస్ ఇన్నింగ్స్ పక్కన పెడితే, అతను కొట్టిన ఒక సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. 

ఇన్నింగ్స్ 9 ఓవర్లో నాలుగో బంతిని హరిస్ రవూఫ్ లెంగ్త్ బాల్ విసిరాడు. ఈ బంతిని స్టోయినిస్ లాంగాన్ దిశగా బలంగాబాదాడు. వేగంగా విసిరినా బంతి అంతే వేగంగా పార్క్ ధాటి వెళ్ళింది. స్టేడియం బయట బంతి పడడంతో అంపైర్లు కొత్త బంతి తెప్పించాల్సి వచ్చింది. క్రికెట్ లో స్టోయినిస్ కు హల్క్ అని పేరుంది. ఇతని పవర్ హిట్టింగ్ అలా ఉంటుంది మరి. ఐపీఎల్ లో ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ లక్నో సూపర్ జయింట్స్ అతన్ని రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసింది. ఈ ఇన్నింగ్స్ తో ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ని RTM కార్డు ఉపయోగించి తీసుకుంటుందేమో చూడాలి. 

ALSO READ | AUS vs PAK: కోహ్లీని దాటేసిన బాబర్.. ప్రమాదంలో రోహిత్ రికార్డ్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్థాన్ పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 117 పరుగులకే ఆలౌట్ అయింది. 118 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 11.2 ఓవర్లలో ఛేజ్ చేసింది. ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.. స్పెన్సర్ జాన్సెన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.