క్రికెట్ ఆడుతూ.. 51 ఏళ్ల వ్యక్తి గ్రౌండ్ లోనే గుండెపోటుతో చనిపోయాడు

క్రికెట్ లో విషాదం చోటు చేసుకుంది. 51 ఏళ్ళ మక్సూద్ అహ్మద్ బుట్వాలా క్రికెట్ ఆడుతూ గుండె పోటుతో మరణించాడు. సూరత్ లోని ఒక టోర్నీ ఆడుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. డ్రింక్స్ విరామ సమయం ముందు వరకు అతను మైదానంలో హుషారుగానే కనిపించాడు. అయితే డ్రింక్స్ విరామ  సమయంలో నీరు త్రాగడానికి నేలమీద కూర్చున్నాడు. నీళ్లు తాగిన వెంటనే అతను పైకి లేచాడు. అంతలోనే ఏదో అసౌకర్యంగా కనిపించిన అతను కింద కూర్చొని కుప్పకూలాడు. 

కిందపడిన వెంటనే అక్కడ ఉన్న ఆటగాళ్లందరూ సహాయం చేయాల్సిందిగా మిగిలిన వారిని పిలవగా అప్పటికే ఆయన మరణించినట్టు తెలిసింది. యువ క్రికెటర్లతో పాటుగా మక్సూద్ అహ్మద్ బుట్వాలా క్రికెట్ ఆడినట్టు తెలుస్తుంది.