మన్యంకొండకు పోటెత్తిన భక్తులు

మహబూబ్​నగర్​ రూరల్, వెలుగు : మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి  శ్రావణ శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవార్లను అర్చకులు శోభాయమానంగా అలంకరించారు. భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

 గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అలహరి మధుసూదన్  కుమార్, అలహరి రామకృష్ణ, ఈవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు.