ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి, ప్రతిపక్ష ఎన్డీయే కూటమికి మధ్య గట్టి పోటీ నెలకొందని పలు సర్వే సంస్థలు తేల్చాయి. కొన్ని సంస్థలు తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పగా.. ఎక్కువ సంస్థలు మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వైపే మొగ్గుచూపాయి.
ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 88. పీపుల్స్సంస్థ సర్వేలో ఎన్డీయే కూటమికి 111 నుంచి 135 సీట్లు వస్తాయని, వైసీపీకి 45 నుంచి 60 సీట్లు వస్తాయని తేలింది. చాణక్య స్ట్రాటజీ సర్వేలో కూడా ఎన్డీయే కూటమికి ఎక్కువ అసెంబ్లీ సీట్లు వస్తాయని వెల్లడైంది. ఇక.. ఆరా సంస్థ మాత్రం వైసీపీకి 94 నుంచి 104.. ఎన్డీయేకు 71 నుంచి 81 సీట్లు వస్తాయని అంచనా వేసింది.