Good Health : రోజుకు 3, 4 పిస్తాలు తినండి.. చాలా రోగాలు మాయం.. గుండెల్లో క్లాట్స్ పడవు..!

పిస్తాలో ఎన్నో విలువైన పోషకాలున్నాయి. వీటిలో క్యాలరీస్ కూడా ఎక్కువే. అందుకే వీటిని పరిమితంగా తీసుకున్నా వాటివల్ల లభించే శక్తి మాత్రం ఎక్కువగానే ఉంటుంది. పిస్తాలో కొవ్వులు, ప్రొటీన్లు ఎక్కువున్నా అవి ఆరోగ్యకరమైనవే. వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.

Also Read :- ఈ డిటాక్స్ డ్రింక్ తాగండి.. కొవ్వు కరిగిపోతుంది..!

  • బి6 విటమిన్ కూడా ఎక్కువగానే ఉంటుంది.
  • పీచు అధికం. దీని కారణంగా మలబద్దకం ఉండదు.
  • విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి ఉండటం వల్ల చాలా రకాల వ్యాధులు దూరం అవుతాయి.
  • విటమిన్ ఇ కూడా ఎక్కువే. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • క్రమం తప్పకుండా తింటే చర్మానికి నిగారింపు వస్తుంది.
  • పొటాషియం పాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
  • రక్తనాళాల్లో రక్తం సాఫీగా ప్రసరించేలా చేయడంతో పాటు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • పాస్ఫరస్, క్యాల్షియం కూడా ఎక్కువే. ఇవి ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు తోడ్పడతాయి.

-వెలుగు,లైఫ్-