రాజస్థాన్ : టికెట్ రద్దు చేసుకుంటే చార్జీ ఎక్కువ తీసుకున్నరని ఓ ప్రయాణికుడు రైల్వేపై న్యాయపోరాటం చేసిండు.. రోజుల తరబడి అన్ని డిపార్ట్మెంట్లకు తిరిగిండు. ప్రధానితో పాటు రైల్వే మంత్రి, అధికారులకు ట్వీట్లు చేసిండు. ఇట్లా ఐదేండ్ల పాటు పోరాడి, చివరకు తనకు రావాల్సిన 35 రూపాయలను రాబట్టుకున్నడు. ఆయన పోరాటం వల్ల ఇప్పుడు దాదాపు 3 లక్షల మందికి డబ్బులు తిరిగొస్తున్నాయి. ఆ ప్రయాణికులు అందరికీ రూ. 35 చొప్పున బ్యాంకులో వేస్తామని రైల్వే శాఖ తెలిపింది. ఈ మొత్తం రూ.2.43 కోట్లు.
ఏం జరిగిందంటే..
కోటాకు చెందిన సుజిత్ స్వామి 2017 ఏప్రిల్లో ఢిల్లీ వెళ్లడానికి రైలు టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాడు. అనుకోని కారణాల వల్ల ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నడు. క్యాన్సిలేషన్ కింద రైల్వే రూ.100 మినహాయించుకుని మిగతా సొమ్మును సుజిత్ఖాతాలో వేసింది. అయితే, అప్పటికి జీఎస్టీ అమలులోకి రాలేదని, క్యాన్సిలేషన్ చార్జీ కింద రూ.35 సర్వీస్ టాక్స్ ఎట్లా విధిస్తారని రైల్వే శాఖను సుజిత్ నిలదీసిండు. దీనిపై రెండేండ్లు ఫైట్ చేస్తే.. 2019లో పొరపాటైందని చెప్పి ఐఆర్సీటీసీ 33 రూపాయలను సుజిత్ ఖాతాలో జమ చేసింది. తనకు రావాల్సింది 35 రూపాయలని, మిగతా 2 రూపాయలు కూడా ఇవ్వాలని సుజిత్ కోరిండు. ఇందుకోసం మరో మూడేండ్లు ఫైట్ చేసిండు. కిందటి శుక్రవారం ఐఆర్సీటీసీ 2 రూపాయలను సుజిత్ ఖాతాలో వేసింది.
మరిన్ని వార్తల కోసం : -
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ను ప్రారంభించిన ప్రధాని
మోడీ ప్రభుత్వానికి భారీగా పెరిగిన అప్రూవల్ రేటింగ్
